ఆర్యలు మరియు నాగులు ఎవరు? | Who were Aryans and Nagas / Dravidians?

 ఆర్యులు - నాగులు | Aryans - Nagas / Dravidians

——————————


నాగులు ఈ భారత దేశాన్ని పాలించిన మహా బలవంతులు.నాగులు ఈ దేశ మూల నివాసులు.బయటి నుండి వచ్చిన ఆర్యులు నాగులను ఓడించలేకపోయారు.నాగులతో రాజీ పడి నాగులను  ఆర్యులతో సమంగా అంగీకరించక తప్పలేదు.ఆర్యులు ప్రాచీన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే తపన ఈ దేశంలో తమ ఆధిపత్య ,అమానుష సంస్కృతిని గొప్పగా చెప్పుకోవాలనే దురుద్దేశం మాత్రమే చరిత్ర పొడవునా మనకు కనిపిస్తుంది.

dasas & kinneras


మన ప్రాచీన భారత దేశానికి ప్రపంచ చరిత్రలో నాగుల వలనే మంచి స్థానం ఉంది.ఆర్యులను ఎదిరించిన ఈ నాగులు బౌద్ధ మతాన్ని అవలంభించారు.అర్యులది వైదిక బ్రాహ్మణ మతం.నేడు హిందూ మతంగా చెప్పబడుతున్నదే ఈ బ్రాహ్మణ మతం ఒకప్పుడు భారతదేశంలో లేనే లేదు.నాగులను కుట్రలతో ఓడించి తదనంతరం ఈ దేశంలో తమదైన ఆధిపత్య మతాన్ని బలవంతంగా మనపై రుద్ది అది సామాన్య జనం అందరిది,ఇదే ఈ దేశ గొప్పతనం అన్నంత గా చరిత్రలో అసలైన చరిత్రను తమ రాజ్యాధికారం తోనూ మతాన్ని రుద్ది ఇదే సనాతన ధర్మం అంటూ వక్రీకరించారు ఈ దేశ చరిత్రను ,సంస్కృతిని.భారత దేశ చరిత్ర అంటేనే ఈ ఆర్య బ్రాహ్మణ - బౌద్దులకి మధ్య జరిగిన తీవ్రమైన సంఘర్షణ.కానీ బ్రాహ్మణులు ఎక్కడా కూడా అసలైన చరిత్రను మనకు తెలియనివ్వరు.పుక్కిటి పురాణాలు,దైవం గురించి ,వేదాలు గురించి ,మరేవో కల్పిత పాత్రలే నిజంగా చరిత్రలో జరిగినవి అన్నట్లు వాటిని ప్రశ్నించ కూడదు అని వాళ్ళే వ్రాసేసుకున్నారు.ప్రతి దేశానికీ చరిత్ర ఉంటుంది .మన దేశంలో చరిత్రను బ్రాహ్మణ దోపిడీ పూజారి వర్గం వక్రీకరించారు.రాజ్యాధికారం తమ గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ములాలే లేకుండా చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.



మనదేశంలో క్రీ.పూ 642 లో బీహార్ లో శిశు నాగుడు ఇతనినే శిసునాక అని కూడా పిలిచేవారు.శిశునాగుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.ఇతను నాగ జాతికి చెందిన వాడు.శిశునాగులు చిన్న చిన్న రాజ్యాలుగా మొదలై  క్రమంగా ఎదిగి మగధ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.మగధ సామ్రాజ్యం బింబిసారుని కాలంలో మంచి పేరు తెచ్చుకుంది.మన దేశాన్ని క్రీ.పూ 413 వరకూ శిశునాగులు పాలించారు.మహా నందుడిని హత్య చేసిన నందుడు తన పేరు మీదుగా నంద వంశాన్ని నెలకొల్పి మగధను క్రీ .పూ 322 వరకూ పాలించారు.తదనంతరం నందులను ఓడించి చంద్ర గుప్త మౌర్యులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు.నాగులలో చివరి వాడే చంద్ర గుప్త మౌర్యుడు.ఇతని రాకతో తిరిగి నాగుల పాలన పునరుద్ధరణ ప్రారంభం అయింది.


మౌర్యులు రాకతో భారతదేశంలో మగధ సామ్రాజ్యం విస్తరించింది.క్రీ.పూ 273 నుండి 232 వరకూ గల కాలంలోఅశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.బౌద్ధం అధికారిక మతం కావడంతో వైదిక బ్రాహ్మణులకు పెద్ద నష్టం వాటిల్లింది.వాళ్ళ దోపిడీ ,ఆధిపత్యానికి అవకాశాలు లేకుండా పోయింది.బ్రాహ్మణులు రెండవ పౌరులుగా బతకాల్సిన పరిస్థితులు సంభవించాయి.అశోకుడు పూర్తిగా బౌద్ధ మత రాజు కావడంతో జంతు బలులు నిషేధించారు.బ్రాహ్మణులకు మంచి లాభసాటి వ్యాపారం ఈ జంతు బలులు.ఇదే నిషేదానికి గురవడంతో బ్రాహ్మణ వాదులు పగ తో రగిలిపోయారు.సుమారు 140 సంవత్సరాలు బ్రాహ్మణులు కూడా సమాజంలో మామూలు మనుషులుగా ఉండి పోయారు .అయితే ఇది వాళ్ళు జీర్ణించు కోలేక పోయారు.శ్రమ చేయకుండా బతకడమే బ్రాహ్మణ ధర్మం దానికోసమే వాళ్ళు దేవుడు ,పూజలు ,క్రతువులు ,యజ్ఞాలు ,యాగాలు సృష్టించారు.ఇది సమర్థవంతంగా నడవడానికి పటిష్టమైన వర్ణ ,కుల వ్యవస్థను రూపొంధించారు.


బ్రాహ్మణులు ఎలాగైనా బౌద్ధ రాజ్యాన్ని పడగొట్టి తమ ఆర్య సంస్కృతిని ఈ దేశం పై రుద్ది తమ దోపిడీని యధేచ్ఛగా కొనసాగించాలని పగతో సమయం కోసం వేచి చూసారు.వాళ్ళకి పుష్యమిత్ర సుంగుడు అనే బ్రాహ్మణుడు తమ ఆధిపత్యానికి మార్గం సుగమం చేసాడు.ఈ పుష్యమిత్ర సామవేది గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు.జంతు బలులు సోమ సమర్పణలు నమ్మే వారు.ఎప్పుడైతే అశోకుడు మొదటి శిలా శాసనం ద్వారా జంతు బలులను నిషేధించడం జరిగిందో సుంగులు బాగా నష్ట పోయారు.అందుకనే పగతో తమ స్వార్థ ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం విశ్వ మానవ కళ్యాణం కోసం ఏర్పడిన బౌద్ధ రాజ్యాన్ని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నారు.


అశోకుని ముని మనవడైన బృహద్రధుడిని హత్య చేసి పుష్యమిత్ర సుంగుడు బ్రాహ్మణ ధర్మాన్ని ఈ దేశంలో స్థాపించాడు.ఆశ్వ మేధ యాగం చేసి తన సార్వ భౌమత్వాన్ని చాటుకున్నాడు.బౌద్ధ మతం పై బ్రాహ్మణులతో అసత్య ప్రచారాలు చేయించాడు.


పుష్యమిత్ర సుంగుడు ఒక్కొక్క బౌద్ధ భిక్షువు తలకు 100 బంగారు నాణేలు బహుమానంగా ఇస్తానని ప్రకటన చేసాడు.బౌద్ధ భిక్షువులను హత్య చేయించాడు.అందుకే చైనా దేశ బౌద్ధులు పుష్యమిత్ర సుంగుడు పేరును పలకడం మహా పాపంగా భావిస్తారు.


ఈ విధంగా ఈ భారత దేశంలో బౌద్ధాన్ని నాశనం చేయడానికి బ్రాహ్మణులు కుట్రలు ,హత్యలు చేసారు.ఈ చరిత్రను కప్పి చెప్పడానికే ఎంతసేపూ ముస్లిం దండయాత్రలు అంటూ భారతదేశ ప్రజలను విభజించి పాలించడానికి కొత్త రకం కుట్రలు చేస్తుంటారు.బ్రాహ్మణ మనువాద ధర్మమే ఈ దేశాన్ని విభజించి పాలించడం.



బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో రెండు సాంస్కృతిక జాతులు ఉన్నాయని పేర్కొన్నాడు: ఆర్యులు మరియు నాగాలు. భారతదేశం అంతటా మూలాంశంగా నాగాల ప్రాబల్యం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బౌద్ధమతం యొక్క ఆగమనం మరియు వ్యాప్తితో సమానంగా ఉంటుంది. నాగులను నాశనం చేయడానికి ఆర్యులు "కాలిపోయిన భూమి" విధానాన్ని అనుసరించారని చారిత్రక మూలాల నుండి బాగా స్థిరపడింది.

Babasaheb Ambedkar claimed that there are two cultural races in India: the Aryans and Nagas. The predominance of the Nagas as the motif throughout India goes hand in hand with the advent and spread of Buddhism in not only Indi but also throughout the world. The Aryans followed the policy of “scorched earth” to destroy the Nagas is well established from the historical sources.


Citations: Dr. Babasaheb Ambedkar writings and speeches volume 7

(Translator’s note: This speech appeared in Prabuddha Bharat in Marathi and this speech summarizes Babasaheb’s great insights into Indian history. Please give it a read to understand Babasaheb on the key issues. Translated from Marathi by Mangesh Dahiwale)


కామెంట్‌లు