కుల వ్యవస్థ ఎలా వచ్చింది? | Indian Caste System

కుల వ్యవస్థ ఎలా పుట్టింది? | Origin of Caste System in India Telugu


 ఈ కుల వ్యవస్థ ఎలా పుట్టింది? | కుల వ్యవస్థ కి మూలాలు తెలుసుకుందాం.

కుల వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను గూర్చి సాంఘిక, సామాజిక నిపుణులు పలు రకాలుగా చెబుతారు. వృత్తిని బట్టి కులమేర్పడినదని, తమ కాళ్ల క్రింద ఇతరులను అణగదొక్కుటకు కొందరు స్వార్థపరుల ద్వారా ఇది స్థాపించబడినదని, ప్రాచీనకాలంలో జరుగుతుండే యుద్దాల కారణంగా ఉమ్మడిగా జీవించే ప్రజలు అనేక తెగలుగా, గుంపులుగా చీలిపోవుట వలన కులవ్యవస్థ రూపుదిద్దుకున్నదని చెబుతారు.

origin of caste system | kula vyavastha


ఐతే కులవ్యవస్థ ప్రాదుర్భావానికి (తెరపైకి) తిరుగులేని విధంగా వత్తాసు పలుకుతూ ఋగ్వేదం లో ఒక బలమైన ఆధారం సూత్రీకరించబడింది. అదే పురుష సూక్తం. కులవ్యవస్థను గూర్చి మనం పైన ప్రస్తావించుకున్న పలు కారణాలు విశ్వాసనీయమైనవి కావచ్చు. కాకపోవచ్చు. కాని ఋగ్వేదంలో ఉన్న ఆధారం మాత్రం తిరుగులేనిదిగా, ఎదురులేనిదిగా వున్నది.

'బ్రాహ్మణో అస్య ముఖమాసీద్, :

బాహూరాజన్య కృత :!

ఊరూత దస్యయద్ వైశ్య:

పద్ భ్యా శూద్రో అజాయత !”

ఋగ్వేదం 1:10:90.

అనగా బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు; తొడల నుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు జన్మించారని అర్థం. హైందవ మతము నకు ప్రామాణికముగా చెప్పబడుచున్న ఆదిమ వేదమైన ఋగ్వేదము కులవ్యవస్థ పుట్టుటకు గొంతెత్తి సాక్ష్యమిస్తున్నది. ఎలాంటి అధికారం లేనప్పటికీ, దౌర్జన్యాలు సాగించేవారికి అధికారం తోడైతే ఇక వారి ఆగడాలకు దురాగతాలకు పట్టపగ్గాలుండవు. ఇదే ఉపాయంతో 'కులం' అనే సామాజిక ఆయుధాన్ని తయారు చేసుకుని ఇతరులపై దయాదాక్షిణ్యాలు లేకుండా పాశవికంగా దాడి చేసేవారు. నేడు ఉనికిలో వున్న వందల కులాలు నాటి కాలములో లేకపోవచ్చు కాని ఇన్ని కులాలుగా చీలిపోవుటకు కారణం మాత్రం పురుషసూక్తమేనని తడబడకుండా, తడుముకోకుండా చెప్పవచ్చు. పైగా కులాల ఆవిర్భావమును గూర్చి తెలియజేసే ఊహాజనితమైన కథలన్నియు అవినీతికంపుతో నిండియున్నవి.

ఐతే నాటి కాలములో జీవించిన కొందరు స్వార్థపరులే ఇతరులను లొంగదీసుకుని గొడ్డుచాకిరి చేయించుకొనుటకు ఈ  వర్ణ వ్యవస్థను రూపొందించి ఋగ్వేదములో జొప్పించారే తప్ప వాస్తవానికి ఇది ఋగ్వేదములో లేదని కొందరు దార్శినికులు సమర్థించే ప్రయత్నం చేసారు.

ఒకవేళ అదే గనుక వాస్తవమైనట్లయితే, మానవాళి జీవిత పరమార్థమును ప్రభోదించవలసిన మనువు కులవ్యవస్థను ఎందుకు బలోపేతం చేస్తాడు?

".......... but a Sudra, whether bought or unbought, he may be compelled to do service work, for he was created to be the slave of a bramana. A Sudra, though emancipated by his master, is not released from servitude; since that is innate in him, who can set him free from it?

మనుస్మతి 8:412.

అనగా, 'శూద్రుణ్ణి కొనుకున్నా కొనుక్కోకపోయినా బ్రాహ్మణుడు అతడిని దాస్యం చేయమని ఒత్తిడి చేయవచ్చు. ఎందుకనగా బ్రాహ్మణునికి సేవ, వెట్టిచాకిరి చేయుట కొరకే శూద్రుడు సృష్టించబడ్డాడు. ఆ శూద్రునికి దాస్యవిముక్తి కలిగిచినప్పటికీ, అతడెక్కడికి తప్పించుకోలేడు. ఎందుకంటే ఆ దాస్యవృత్తి అతడికి జన్మసిద్ధమైనది. ఆ దాస్యవృత్తి నుండి అతడిని ఎవరు తప్పించగలరు?'

ఋగ్వేదంలో ఉన్న వర్ణవ్యవస్థను మనువు మరింత కఠినం చేయుటను బట్టి నిమ్నకులాల ప్రజలపై అగ్రకులాలవారు కన్నూమిన్నూ కానకుండా విరుచుకుపడ్డారు. ఒకవేళ హైందవ దార్శినికులు కులవ్యవస్థ ఋగ్వేదములో లేదని వాదించినట్లయితే మనువు దానిని ఎందుకు ఆమోదించినట్లు? పోనీ, కులవ్యవస్థను ప్రస్తావించుటకు మనువును పరిగణలోనికి తీసుకోకపోయినా భగవద్గీతను తప్పనిసరిగా మనం పరిగణలోనికి తీసుకోవాలి.

“చాతర్వర్ణ్యం మయా సృష్టం

గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి

మాం విద్యకర్త మవ్యయమ్”

భగవద్గీత. 4:13.

అనగా, నాలుగు వర్ణాలు నా చేతనే సృష్టించబడ్డాయి అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు.

కులమనేది ఎలా పుట్టింది అనే ప్రశ్నకు గొప్ప గొప్ప చదువులు చదివిన విద్యావంతులైనను, చరిత్ర పరిశోధకులైనను ముక్కుసూటి సమాధానం చెప్పడానికి ససేమిరా ఇష్టపడరు. చూసీ చూడనట్టు వినీ విననట్లు వ్యవహరిస్తారు. కుల వ్యవస్థ పట్ల అమితమైన గౌరవం, అపారమైన ప్రేమ వీరికి ఉండుటయే దీనికి కారణం. సమాజాన్ని భ్రష్టుపట్టించే కులవ్యవస్థ గూర్చిన భ్రష్టత్వం వీరికి ఇంత తెలిసియుండి కూడా దానిని ఖండించకపోతే ఇక వీరిని ఏమనాలి?

తోటలో కలుపుమొక్కలను పెరికి పారేయకపోతే చివరాఖరుకి అవి పంటనంతటిని బలహీనపరుస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. కులం కూడా అంతే. దాని ద్వారా సమాజం బాగుపడదు, అభివృద్ధిలోనికి రాదు. ఒకవేళ అభివృద్ధిలోనికి వచ్చినా మరొక ప్రక్క సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. కులం ద్వారా కొంతమంది తమలో తామే ఘనంగా ఊహించుకుంటూ వుంటారు. గొప్పగా అతిశయిస్తూ ఉంటారు. తమ పూర్వీకుల ద్వారా ఏదో తమకు సంక్రమించినదని, అది ఎదుటివారిలో లేనిదని ఊహించుకుని తెగ సంబరపడిపోతుంటారు. ఆ సంబరం ఎంత రెట్టింపు స్థాయిలో ఉంటుందంటే “మేము కూటికి పేదలమైనా కులానికి మాత్రం పేదలము కాదు' అనే విధంగా వుంటుంది. అవును అలవాటు పడిపోయిన ఆలోచనా విధానమును వదులుకోలేని బలహీనతే కులమును సమర్థించుకొనుటకు బలమైన కారణం. ఇలాటి వారు కులమనే సంకెళ్లనుండి విడుదల పొందనేరరు.


కుల వ్యవస్థ గురించి Hindustan Times కథనం 

భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క మూలానికి సంబంధించి భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రపంచ సృష్టికర్త అయిన బ్రహ్మ శరీరం నుండి వర్ణాలు సృష్టించబడ్డాయి అని మత సిద్ధాంతం పేర్కొంది. అతని నావికాదళం నుండి బ్రాహ్మణులు సృష్టించబడ్డారు; అతని చేతుల నుండి క్షత్రియులు; అతని తొడల నుండి వైశ్యులు మరియు అతని పాదాల నుండి సుద్రులు. సాంఘిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ యొక్క మూలం భారతదేశంలో ఆర్యుల రాకతో దాని మూలాన్ని కనుగొంటుంది. క్రీస్తుపూర్వం 1500 లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. ఆర్యులు స్థానిక సంస్కృతులను పట్టించుకోలేదు. వారు ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలను జయించడం మరియు నియంత్రించడం ప్రారంభించారు మరియు అదే సమయంలో స్థానిక ప్రజలను దక్షిణ దిశగా లేదా ఉత్తర భారతదేశంలోని అరణ్యాలు మరియు పర్వతాల వైపుకు నెట్టారు.

ఆర్యులు తమను తాము మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్నారు. మొదటి సమూహం యోధులది మరియు వారిని రాజన్య అని పిలిచేవారు, తరువాత వారు దాని పేరును క్షత్రియులుగా మార్చారు. రెండవ సమూహం అర్చకులలో ఉంది మరియు వారిని బ్రాహ్మణులు అని పిలుస్తారు. ఈ రెండు వర్గాలు ఆర్యులలో నాయకత్వం కోసం రాజకీయంగా కష్టపడ్డాయి. ఈ పోరాటంలో బ్రాహ్మణులు విజయం సాధించారు. మూడవ సమూహం రైతులు మరియు హస్తకళాకారులు మరియు వారిని వైశ్యులు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించి, స్వాధీనం చేసుకున్న ఆర్యులు స్థానికులను లొంగదీసుకుని వారి సేవకులుగా చేసుకున్నారు.

బహిష్కృతులు మరియు మూడు ఆర్యన్ వర్ణాల మధ్య సమాజంలోని సాధారణ కార్మికులు అయిన సుద్ర వర్ణ ఉంది. సుద్రులు రెండు వర్గాలను కలిగి ఉన్నారు. ఒకరు ఆర్యులచే లొంగిపోయిన స్థానికులలో ఒకరు, మరొకరు స్థానికులతో ఆర్యుల వారసులు.


హిందూ మత కథలలో మంచి ఆర్యులు మరియు ముదురు రంగు చర్మం కలిగిన రాక్షసులు మరియు దెయ్యాల మధ్య చాలా యుద్ధాలు ఉన్నాయి. వేర్వేరు దేవుళ్ళకు ముదురు రంగు చర్మం గల బానిసలు కూడా ఉన్నారు. మంచి ఆర్యన్ పురుషులను మోసపూరితమైన మార్గాల్లో మోసగించడానికి దెయ్యాల స్త్రీలు ప్రయత్నిస్తున్న కథలు ఉన్నాయి. ఆర్యన్ వీరులు మరియు దెయ్యాల మహిళల మధ్య వివాహాలు కూడా జరిగాయి. ఈ సంఘటనలు నిజంగా సంభవించాయని చాలా మంది నమ్ముతారు, ఇందులో దేవతలు మరియు సానుకూల వీరులు ఆర్యన్ మూలానికి చెందినవారు. మరియు రాక్షసులు, దెయ్యాలు మరియు ముదురు రంగు చర్మం గల బానిసలు వాస్తవానికి భారతదేశం యొక్క అసలు నివాసం, వీరిలో ఆర్యులు రాక్షసులు, దెయ్యం, రాక్షసులు మరియు బానిసలుగా ఉన్నారు.


Source : Origin of Caste System in India


ఈరియడ్ వెంకటప్ప రామసామి (17 సెప్టెంబర్ 1879 - 24 డిసెంబర్ 1973), సాధారణంగా పెరియార్ లేదా తంతై పెరియార్ అని పిలుస్తారు, ఒక భారతీయ సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు, ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రవిదార్ కజగం ప్రారంభించారు. ఆయనను 'ద్రావిడ ఉద్యమ పితామహుడు' అని పిలుస్తారు.
Watch this video on అంటరానితనంపై పెరియార్ పోరాటం:



కామెంట్‌లు