దసరా నాడు అంబేద్కర్, అశోకుడు ఏమి చేసారు | అశోక విజయ దశిమి..

 అశోక విజయ దశిమి.. 

————————————————————


👉  డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు 14 అక్టోబరు 1956 అశోక విజయ దశిమి రోజున 6 లక్షల మంది అనుయాయులతో బౌద్ధ దమ్మ దీక్షను దమ్మ గురువు మాహస్థవీర్ చంద్రమణి ఆధ్వర్యంలో స్వీకరించారు.


👉 డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించడానికి ప్రధానమైన కారణాలు రెండు.


@ ఒకటి హిందు మతం వ్వక్తికి ప్రాధాన్యత ఇచ్చే మతం కాదు. అది జాతి మరియు వర్గంకు ప్రాధాన్యత ఇచ్చే మతము. హిందూ మతములో వ్వక్తి వికాసానికి అవకాశాలు లేవు, కావున హిందూ మతములో ఎన్ని యుగాలు ఉన్నప్పటికీ మన స్థితిగతులు మారవు.


@ రెండవ కారణం భారత దేశం గత చరిత్రను పరిశీలిస్తే బౌద్ధ శాసన కాలములో భారతదేశం సువర్ణ దేశముగా పేరు గాంచినది. క్రి.పూ.6వ శతాబ్దం నుండి దాదాపు 1800 సంవత్సరాల పాటు తక్షశిలా, నలంద, విక్రమశిల, వల్లభీ , సోమపుర, థేరోపతి, దంతపురి.


👉 మొదలగు బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఈ ప్రపంచానికి జ్ఞాన భిక్షను పెట్టినాయి. 8వ శతాబ్దం వరకు భారత దేశ అక్షరాస్యత 96.4%. ఎనిమిదవ శతాబ్దం తర్వాత బ్రహ్మణియుల కుట్రల వలన బౌద్ధ ధమ్మం ఆధరణ కొల్పోయి, బ్రహ్మణ వాదముతో తలపడి, మహ్మదీయ దాడులతో క్షీణ దశకు చేరుకుంది బౌద్ధం.


బ్రాహ్మనీయ వాదము తిరిగి బలపడి వర్ణ వ్వవస్తను హిందూ మతానికి పునాదిచేసి, అధికశాతం ప్రజలను కులాల వారిగా విభజించి వారికి దైవ సిద్దాంతాల ద్వారా, మూఢనమ్మకాల ద్వారా , అజ్ఞానులుగా మార్చి వారి మధ్య ధ్వేషాలను, అసమానతల్ని సృష్టించింది వైదిక హిందూ ధర్మం.


బ్రహ్మానీయ వాదము చేసిన తప్పిదంను గుర్తించి, భారతదేశ గత మరియు భవిష్యత్తు చరిత్రను దృష్టిలో పెట్టుకొని, పతనావస్తలో ఉన్న బౌద్ధానికి జీవంపోసి భారత దేశాన్ని బౌద్ధమయం చేస్తాను అన్న ఏకైక దేశ భక్తుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.


👉 డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు బౌద్ధ దమ్మాన్ని హిందువుల పండగ అయిన దసరా/అశోక విజయ దశమి రోజున ఎందుకు తీసుకున్నారనేది అందరికీ ఉత్పన్నమయ్యే ప్రశ్న.


👉 వాస్తవానికి దసరా లేదా అశోక విజయ దశమి హిందువుల పండుగే కాదు.


👉 దసరా రోజున రాముడు రావణుడిని చంపడం, రావణుడికి 10 తలలు ఉన్నట్లు చిత్రీకరించడం కల్పితం.


👉 రామ చరిత మానస్ ప్రకారం రావణుడు చైత్ర మాసంలో చంపబడ్డాడు. కాని విజయ దశమి లేదా దసరా అశ్విని మాసం దశమి రోజు ఎందుకు జరుపుతాం అనే ప్రశ్నకు హిందువుల వద్ద సమాధానం ఉండదు. కారణం రామాయణం కల్పిత కథ కాబట్టి.


ఇక్కడ రాముడు ఎవ్వరో కాదు మౌర్య వంశం చివరి రాజు అయిన బృహదత్!మౌర్యను క్రి.పూ.185లో కుట్ర పూరితంగా చంపిన అతని సేనాపతి పుస్యమిత్ర శృంగుడు బృహదత్తుడు మౌర్య వంశం10వ రాజు కావడంతో పది వంశాల బౌద్ధ శాశన కాలమును అంతం చేశామని సంతోషంతో బృహదత్ మౌర్యను రావణుడిగా చిత్రీకరించి 10 తలలు ఉన్నట్లు కాల్పనిక కథను అల్లి దశ్+హరా - దసరా పండుగను జరుపుకున్నారు.


👉 మౌర్యలు భారత దేశాన్ని 137 సంవత్సరాలు పరిపాలించారు. మౌర్య వంశం రాజులు


1.చంద్రగుప్త మౌర్య

2.బిందుసార మౌర్య

3.సామ్రాట్ అశోక్

4.కుణాల్ మౌర్య

5.దశరథ్ మౌర్య

6.సంప్రతి మౌర్య

7.శాలిసుక్త మౌర్య

8.దేవనామ్ మౌర్య

9.సత్యధన్ మౌర్య

10.బృహదత్ మౌర్య


*సామ్రాట్ అశోకుని కాలములో భారత దేశాన్ని 

( జంబుద్వీపం ) స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఈ కాలములోనే దేశము సోనేకి చిడియాగా పేరు గాంచింది.*


అశోకుడు కళింగ యుద్ధం తర్వాత దమ్మ గురువు మొగలి పుత్తథిస్స దగ్గరకు వెళ్లి నన్ను ఆశీర్వాదించండి నేను కళింగాన్ని జయించి గొప్ప సామ్రాట్ అయ్యాను అని వేడుకున్నాడు. అప్పుడు దమ్మ గురువు అశోకునితో ఇలా అంటారు *"రాజు అనేవాడు ప్రజల శ్రేయస్సును, ప్రజల సుఖ సంతోషాలు కోరేవాడై ఉండాలి. నువ్వు కళింగ యుధ్దంలో లక్షల మందిని చంపి, లక్షల మందిని గాయపరిచిన వాడివి నువ్వు ప్రజల సామ్రాట్ ఎలా అవుతావు?"



     *అని అడగడంతో అశోకుడు తన తప్పును తెల్సుకోని క్రి.పూ.254వ సంవత్సరంలో పాటలిపుత్ర మైదానంలో ధమ్మ గురువు మొగలి పుత్త్ థిస్స ఆధ్వర్యంలో తన అయుధాలను శుభ్రంగా కడిగి బుద్దుని పాదాల్లో పెట్టి అశ్వనీ మాసం దశిమి రోజున బౌద్ధ ధమ్మ దీక్షను స్వీకరించారు. 

       ఇది తర్వాత కాలంలో అశోక విజయ దశిమిగా బౌద్ధులు పండగను చేయడం ఆచారంగా మారింది. దీన్ని హిందువులు వక్రీకరించి ఇదే రోజు జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని ఆయుధాలకు పెట్టి పండగను చేస్తున్నారు...........

కామెంట్‌లు