ఆర్యులు ఈ దేశపు వారేనా? | Indus Valley Civilization | Aryans Migration to India | సింధులోయ నాగరికత

ఆర్యులు ఈ దేశపు వారేనా? | Indus Valley  Civilization | Did Aryans come from west | సింధులోయ నాగరికత

        👉 అసలు ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశంపై ఎన్నో సందేహాలు ఉండడం సహజమే. ఈ అంశాన్ని సింధు లోయ నాగరికత లేదా హరప్ప నాగరికత ఎలా అంతరించి పోయింది, దానికి కారణాలు ఏమిటి అనే విషయాలకు జోడించి వాస్తవాలు తెలుసుకొందాం1. కానీ శాస్త్ర వేత్తలు చెప్పిన ప్రతీ హైపో థీసిస్ను  నమ్మకుండ అత్యంత కచ్చితత్వం కల్గిన కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా నిరూపించబడిన సిద్దాంతాలను మాత్రమే మనం లెక్కలోకి తీసుకోనీ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.


Indo-Aryan Migration

 Dravidian Invasion Theory | Harappa Civilization | హరప్ప నాగరికత | ద్రావిడ దండయాత్ర సిద్ధాంతం

👉 అవినాష్ చంద్ర దాస్ మరియు Dr సంపూర్ణ ఆనంద్ లాంటి  పండితులు, ఆర్యులు ఈ భారత దేశంలోని సప్త సింధు ప్రాంతానికి చెందిన వారు  అని చెప్పారు. కానీ వీళ్ళు దీనికి సరియైన రుజువులు చూపలేక పోవడం వల్ల చాలా మంది చేత ఇది తిరస్కరించబడింది.

👉ఫారిన్ ఆరిజిన్ తీరీస్: Foreign Origin Theories on Indus Valley Civilization

సింధులోయ నాగరికత అంతరించి పోవడానికి కారకులు అయిన ఆర్యులు విదేశం నుంచి వచ్చి సప్త సింధు ప్రాంతంలో స్థిర పడ్డారు అని ఎక్కువ మంది పండితుల అభిప్రాయం.

 1) బాల గంగాధర తిలక్ ప్రకారం: ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ అర్యన్స్

2) ప్రొఫెసర్ పెంక మరియు మెక్ డోనాల్డ్ లాంటి యూరోప్ పండితుల ప్రకారం ఆర్యులు జర్మనీ కి చెందినవారు. వాస్తవానికి జర్మన్లు నిజమైన నార్దిక్ ప్రజలు ఎందుకంటే హిట్లర్ నాజీ పార్టీ గుర్తు కూడా స్వస్తిక్ గుర్తు, ఇదే గుర్తు ఆర్యులకు పవిత్రమైన గుర్తుగా మనం గమనించ వచ్చు.

3)👉అత్యధికంగా పండితుల చేత అంగీకరించ బడిన సిద్దాంతం మాక్స్ ముల్లర్ సిద్దాంతం. ఇతను ఒక జర్మన్ ఇండాలోజిస్ట్. ఇతనిఅభిప్రాయం ప్రకారం ఆర్యులు మద్య ఆసియా ప్రాంతానికి చెందిన వారు (మద్య ఆసియా అనగా USSR+ తుర్కిమెనిస్తన్+ కజకిస్థాన్). ఇతని అభిప్రాయం ప్రకారం ఆర్యులు యురేషియా ప్రాంతం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది (ఆర్య అనేది యురేషియా ప్రాంతం అయిన కజకిస్థాన్ లోని ఒక తెగ పేరు మరియు వారి వృత్తి రీత్యా పశువులు కాచుకొవడం)  అంతే కాకుండా అక్కడి బోగజ్కోయి  అనే ప్రాంతంలో బయల్పడిన శాసనాల ద్వారా   ( సుమారుగా 1400BC మద్య కాలం నాటి బోగజ్కొయి పురాతన శాసనం ద్వారా)

 ఆర్యులు తమ దేవుళ్ళు అయినటువంటి ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య లను తీసుకొని మద్య ఆసియా కు తూర్పుగా ఉన్న ప్రాంతాలకు వలస పోయినట్టు తెలుస్తుంది. అదే దేవుళ్ళను ఈ ఆర్యులు ఇక్కడ పూజించినట్లు గా చూడవచ్చు.

 

👉 ఫిలాలోజికల్ స్టడీ ని గమనిస్తే ఇరాన్ అనే పదం ఆర్యన్స్ నుంచే ఉద్భవించింది. ఇరాన్ లో ఆర్యులు జొరాస్ట్రియన్ మతము ను ఏర్పాటు చేసుకున్నారు. వీరి పవిత్ర గ్రంధం జెండ్ అవెస్తా ఇది సామ వేదానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. "అహుర మజ్దా" వీరి దేవుడు. పర్షియన్ భాష లో ’హా’ అనే శబ్దం ఋగ్వేదం లో  ’స’ అనే శబ్దం గా పిలువబడుతుంది.

 ఉదా: హోమ అని పర్శియన్ లో ఉంటే సోమా .   అని ఋగ్వేదంలో ఉంటుంది.( రెండిటిలో             దేవునికి అర్పించేధి అని అర్థం)   ’ అహుర మజ్ద’ జొరాస్ట్రయన్ ల దేవుడు.

  అసుర మర్ధన అనగా రాక్షసులను  చంపేవాడు, దేవుడు అనే అర్థం వస్తుంది వేదాల ద్వారా. 


👉అదేవిధంగా హరప్ప నాగరికత ఏవిధంగా ధ్వంసం  అయ్యింది అనే విషయంపై విభిన్నాభిప్రాయాలు వున్నాయి. వాటన్నింటినీ నేనిక్కడ చర్చించడం లేదు. నేను ముందే పైన చెప్పినట్టుగా కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా నిరూపితం అయిన వాటిని మాత్రమే చర్చిస్తున్న. వాటిలో ముఖ్యంగా మార్టిమం వీలర్ యొక్క ఆర్యుల దండ యాత్ర అనే హైపో థీసిస్ . ఇది ఆర్కియాలజికల్ మరియు సైంటిఫిక్ రుజువులను కలిగి ఉంది. 

మహోంజదారో లో బయల్పడిన 13 అస్థి పంజరాల మీద ఉన్న కత్తి గాట్ల ద్వారా అక్కడ ఉన్న పిల్లలు, మహిళలు, పురుషులు కత్తులతో చంపబడినట్లు కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా నిరూపితం అయింది. హరప్పా నాగరికత లో లింగా ఆరాధన ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్యుల ఋగ్వేదంలో లింగారాధన చేసే వారిని దూరంగా ఉంచండి అని చెప్పబడినట్టు, ఇంద్రుణ్ణి యుద్ద దేవునిగా కీర్తించినట్టు, ఇతనికే ’ పురందర’ అనగా పురములను ధ్వంసం చేసే వాడు అనే టైటిల్ ఉన్నట్లు తెలుస్తోంది.( పుర అనగా చుట్టూ ప్రాకారం కట్టబడిన నగరం అని అర్థం). ఈ విధంగా హరప్పా నాగరికత అంతరించి పోవడానికి ఆర్యుల దాడులే కారణం అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు.

 

మనకు ఇంతకంటే రుజువులు ఏమి కావాలి ! ఆర్యులు విదేశీయులు అని చెప్పడానికి.😊!

Source: Indo-Aryans Migrations (Wikipedia)

కామెంట్‌లు